వరుస సినిమాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే.. రెమ్యునరేషన్‌లో కూడా తగ్గేదే లే అంటున్న బుట్టబొమ్మ

by Kavitha |
వరుస సినిమాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే.. రెమ్యునరేషన్‌లో కూడా తగ్గేదే లే అంటున్న బుట్టబొమ్మ
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో బుట్టబొమ్మగా క్రేజ్ తెచ్చుకున్న పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఒక లైలా కోసం’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది అనుకుంటే ‘అలవైకుంఠపురంలో‘ సినిమా తర్వాత చేసిన అన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ బిరుదు తగిలించుకుంది.

ఆ తరువాత పూజ హెగ్డే పని అయిపోయింది, ఇక తెలుగులో సినిమాలు రావడం కష్టం అన్నారు. కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ పూజా హెగ్డే ఇటు దక్షిణాదిలోనూ, అటు హిందీలోనూ మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ, పారితోషికం కూడా ఎక్కడా తగ్గించకుండా తన హవాని కొనసాగిస్తోంది. ఇప్పుడు వరస సినిమాలతో పూజ మళ్ళీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం అండమాన్ లో తమిళ సూపర్ స్టార్ సూర్య తో సినిమా చిత్రీకరణలో వుంది పూజా హెగ్డే. ఈ సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. ఈ సినిమా తరువాత నిర్మాత సురేష్ బాబు, పూజ హెగ్డే తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది వుమెన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఇది అయ్యాక ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి ఒక కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు, ఆ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కూడా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనుంది అని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తారని తెలుస్తోంది.ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న పూజా హెగ్డే పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు. ఆమె అక్షరాలా రూ. 4 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. మధ్యలో విరామం తీసుకున్నా కూడా పారితోషికంతో మాత్రం తగ్గేదే లే అని చెప్తోంది పూజా హెగ్డే. ఆమె ఏ సినిమా చేసిన అందులో తన హార్డ్ వర్క్ పెడుతుంది, అందుకే ఆమెకు పారితోషికం అంత ఇవ్వవచ్చు అని అంటున్నారు ఇండస్ట్రీలో.

Advertisement

Next Story

Most Viewed