ఆ విషయంలో చాలా బాధపడ్డాను.. ఇప్పుడు గర్వంగా ఉంది

by Prasanna |
ఆ విషయంలో చాలా బాధపడ్డాను.. ఇప్పుడు గర్వంగా ఉంది
X

దిశ, సినిమా : స్టార్ నటి పూజాహెగ్డే తను లాస్ట్ ఇయర్ నటించిన హిందీ చిత్రం ‘సర్కస్‌’ ఫెయిల్యూర్‌‌పై ఓపెన్ అయింది. ప్రస్తుతం ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న పూజా రీసెంట్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను నటించే ప్రతి చిత్రాన్ని సొంత బిడ్డలా చూస్తాను. ‘సర్కస్‌’ కూడా అలాంటిదే. ఈ మూవీ సక్సెస్‌ అవుతుందనుకున్నా. కానీ, నా అంచనా తారుమారవడంతో చాలా బాధపడ్డా. అయితే రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. నా పాత్రకు మంచి పేరు వచ్చినందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పింది. చివరగా ఏప్రిల్ 21న రిలీజ్ కానున్న సల్మాన్ మూవీలో ‘ఏంటమ్మా’ పాటకు దక్షిణాది నటీనటులతో పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story