Pooja Hegde: పొట్టి గౌన్‌లో హాట్ ట్రీట్.. దానితో పోటీ పడుతున్నానంటూ పోస్ట్

by Hamsa |
Pooja Hegde: పొట్టి గౌన్‌లో హాట్ ట్రీట్.. దానితో పోటీ పడుతున్నానంటూ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు తెలుగులో ముకుంద మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురం’ సినిమాలో నటించాక ఈ బ్యూటీ బుట్టబొమ్మగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది . 2023లో ‘కిసికా బాయ్ కిసికా జాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా హిట్ అందుకోలేదు. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు కొత్త సినిమాను ప్రకటించలేదు.

గత కొద్ది కాలంగా పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ నడుస్తుందని చెప్పాలి. హిందీ, తెలుగులో అమ్మడుకి ఆఫర్లు తగ్గడంతో యాడ్ షూట్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ తన హాట్ పిక్స్ షేర్ చేస్తుంది. తాజాగా, ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లలో హీట్ పెంచుతున్నాయి. పొట్టి గౌన్‌లో పింక్ కలర్ ఐస్ క్రీమ్ పట్టుకుని థైయ్స్ షో చేసింది. ఇక ఈ ఫొటోలకు ‘‘సూర్యుడితో పోటీ పడుతున్న అమ్మాయి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసిన వారంతా చంపేసావు.. ఫ్యాబులస్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఈ అమ్మడు ప్రజెంట్ నాగచైతన్యతో ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం.

(Video Link Credits To Pooja Hegde Instagram Channel)



Next Story