Rashmi Gautam : మందు కొడుతూ చిల్ అవుతున్న యాంకర్ రష్మీ.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే!

by Javid Pasha |
Rashmi Gautam : మందు కొడుతూ చిల్ అవుతున్న యాంకర్ రష్మీ.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా : జబర్దస్త్ కామెడీ షోతో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న రష్మీ గౌతమ్ గురించి తెలిసిందే. ఓ వైపు స్మాల్ స్ర్కీన్‌పై యాంకర్‌గా అలరిస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందరి చూపునూ తనవైపు తిప్పుకుంటుంది.

సినిమాలు, టీ షోల గురించి మాత్రమే కాకుండా రష్మీలో మరో యాంగిల్ కూడా ఉంది. ఏంటంటే ఆమె వివిధ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జంతు ప్రేమికురాలిగా ఆమె పెట్టే పోస్టులు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఇటీవల ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటనపై తీవ్రస్థాయిలో రెస్పాండ్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే కొద్ది రోజులుగా రష్మీ ప్రముఖ వ్యక్తితో డేటింగ్‌లో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జబర్దస్త్ ఫేమస్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈమె రిలేషన్‌లో ఉందని, అతనితోనే పెళ్లి జరుగుతుందనే వార్తలు కూడా గతంలో వినిపించాయి. కాగా వీరిద్దరి కాంబినేషన్ కామెడీ షోకు సెట్ అయిందని, అది అంత వరకే పరిమితమని కూడా చర్చ జరుగుతోంది. ప్రజెంట్ ఆమె వేరే వ్యక్తితో రిలేషన్ ‌‌లో ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎవరైతేనేమీ ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంటే చాలు అన్నట్లు ఆమె ఫాలోవర్స్ మాత్రం ఆ శుభవార్తకోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్‌ రష్మీగౌతమ్‌కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో ఆమె ఓ వైన్ ఫ్యాక్టరీలో తిరుగుతూ, మందు తాగుతూ చిల్ అవుతున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ మందు తాగుతూ మజా చేస్తోందని, ఫుల్ కిక్కులో ఉన్నావంటూ సరదా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed