- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా అభిమానులు నన్ను కూడా తిడుతున్నారు.. ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నగారా మోగడానికి మరికొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో ఇప్పటికే ఎలక్షన్ల వేడి ఆంధ్రప్రదేశ్‌ని చుట్టుముట్టింది. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం తన వారాహితో ప్రచారంలోకి దిగారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న పవన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫ్యాన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మిమ్మల్ని కానీ.. మీ పార్టీని కానీ మీడియా విమర్శలు చేస్తే మీ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ తిట్టిపోస్తున్నారు. దీనికి మీరు ఏమంటారని పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించగా.. ‘‘సోషల్ మీడియా వేదికగా ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఒక్కోసారి నా అభిమానులు చివరికి నన్ను కూడా తిడుతున్నారు. ఆ మధ్య తానా సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్తానంటే ఫ్యాన్స్ తెగ తిట్టారన్న పవర్ స్టార్.. అలా తిడితే ఎంతమందిని ఆపగలమని ప్రశ్నించారు. తిట్టమని తాను ఎవరినీ ప్రోత్సహించడం లేదని.. చాలాసార్లు వద్దని చెప్పానని గుర్తుచేశారు. అలా చెప్పినందుకు కొందరు తనకు కూడా ఎదురుతిరిగారని తెలిపారు. అభిమానుల్లో తన మాట కూడా వినని వ్యక్తులు ఉన్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read more :
పవన్ కల్యాణ్‌ది పవిత్ర వాహనం కాదు.. అది ఓ ‘పంది’..!
పవన్ కల్యాణ్ ఏమైనా చేగువేరానా : Minister Ambati
పవన్ రాజకీయ వ్యవహారశైలిపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు