Pawan Kalyan : 'బ్రో' టీజర్ చూసి బిగ్గరగా నవ్విన పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న వీడియో

by Shiva |
Pawan Kalyan : బ్రో టీజర్ చూసి బిగ్గరగా నవ్విన పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘బ్రో ది అవతార్’. ఈ చిత్రాన్ని తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి భారి అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రం గురించి అప్ డేట్స్ ఇవ్వట్లేదంటూ మూవీ మేకర్స్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన టీజర్ ను రేపు లేదా ఎల్లుండి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వారాహి విజయ యాత్ర’లో ఉండటంతో, హైదరాబాద్ కు వెళ్లి సినిమాకు డబ్బింగ్ చెప్పే అవకాశం లేకపోవడం లేదు. దీంతో చిత్ర దర్శకుడు సముద్ర ఖని నేరుగా భీమవరం కు వెళ్లాడు. అక్కడే పవన్ తో టీజర్ కి సంబంధించిన డబ్బింగ్ చెప్పించుకున్నాడు. దీంతో త్వరలోనే టీజర్ మొత్తం సిద్ధం అయిపోయిందని, అప్డేట్ త్వరలోనే ఇస్తామని డైరెక్టర్ సముద్ర ఖని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.

అయితే, టీజర్ చూస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ ఓ షాట్ ను చూసి బిగ్గరగా నవ్వాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతోంది. కేవలం టీజర్ చూసి అంతలా నవ్వాడంటే.. సినిమాలో ఇంకెంత పవర్ ప్యాక్ ఉందోనని, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేలా సినిమాలా ఉండబోతోందని పవన్ అభిమానులు ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు.

Advertisement

Next Story