- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
PAWAN-CHIRANJEEVI: చిరంజీవిపై మండిపడ్డ పవన్ కళ్యాణ్.. విడిపోవద్దని మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఎందుకంటే?
దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ముఖ్యంగా మెగా బ్రదర్సైన మెగాస్టార్ చిరంజీవి అండ్ పవర్ స్టార్ అనుబంధం చాలా ప్రత్యేకమైనది. చిరు కారణంగానే నేడు ఈ స్థాయిలో ఉన్నానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు చెబుతూనే ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి కారణంగా టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ అనే మహావృక్షం పాతుకుపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా ప్రతి ఒక హీరో నేడు మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అయితే ఓ సందర్భంలో మెగాస్టార్ తమ్ముడు పవన్ కల్యాణ్ మండిపడ్డారట.
సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కూడా పీఆర్పీ కోసం అప్పుడు చాలా కష్టపడ్డారట. కానీ ఫలితం దక్కకపోవడంతో చిరు ఓటమి చవిచూడాల్సి వచ్చిందట. దీంతో మెగాస్టార్ నిర్ణయాన్ని పవర్ స్టార్ తప్పుబడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. పలు ఇంటర్వ్యూల్లో తమ్ముడు పవన్ కల్యాణ్ మీపై చేసిన కామెంట్లపై మీ స్పందన ఏంటని చిరును ప్రశ్నించగా.. పవన్ ది చిన్న పిల్లల మనస్తత్వమని, ఆయన మాటలు పెద్దగా పట్టించుకోనని సింపుల్‌గా కొట్టిపారేశారట.
కానీ వీరిద్దరు కొద్ది రోజుల వరకు కలవకుండా దూరంగా ఉన్నారని సమాచారం. తర్వాత మళ్లీ ఓ వెకేషన్‌లో ఒక్కటయ్యారని నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. మరీ ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ‘పవన్ కల్యాణ్-చిరంజీవి మధ్య గొడవలు రావడం ఏంటి? చిన్న చిన్న గొడవలు వచ్చినా వెంటనే కలిసిపోవాలి. మెగా ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీకి అండ్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదర్శవంతమైన ఫ్యామిలీగా చెప్పుకోవాలని, కాగా ఎల్లప్పుడూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అన్యోన్యంగా కలిసి మెలసి ఉండాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.