- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Gabbar Singh’ పై వ్యతిరేకత.. రీరిలీజ్ వద్దు అంటున్న ఫ్యాన్స్!
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ హిట్ లలో ‘గబ్బర్ సింగ్’ సినిమా ఒకటి. దాదాపు 10 ఏళ్లు వరుస పరాజయాలతో ఉన్న సమయంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా పవన్ కల్యాణ్‌కు మంచి బూస్ట్ ఇవ్వడంతో పాటు.. ఇండస్ట్రీలో అనేక రికార్డులను తిరగ రాసిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ మూవీని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
అయితే దీనిపై అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే.. ఆగస్టు-31, సెప్టెంబర్-1 న గుడుంబా శంకర్ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు నాగబాబు ప్రకటించారు. రీ రిలీజ్ నుంచి వచ్చే ఫండ్స్ జనసేన పార్టీకి ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. ఈ మేరకు అభిమానులు.. ‘గుడుంబా శంకర్’ ఉంది కదా అన్న.. ‘గబ్బర్ సింగ్’ తర్వాత రీ రిలీజ్ చేద్దాం’ అని కొందరు అంటుంటే.. ‘నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం’ అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.