7 ఆస్కార్ గెలిచిన ‘ఓపెన్ హైమర్’ 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే ?

by Kavitha |
7 ఆస్కార్ గెలిచిన ‘ఓపెన్ హైమర్’ 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే ?
X

దిశ, సినిమా: తాజాగా జరిగిన ఆస్కార్ 2024 అవార్డ్స్‌లో ‘ఓపెన్‌‌హైమర్’ సినిమా ఏకంగా 7 అవార్డ్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 13 నామినేషన్లలో ఎంపికైన ఈ మూవీ ఏడు అత్యధికంగా ఆస్కార్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌తోపాటు ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్‌లో ఆస్కార్స్ సాధించింది ‘ఓపెన్ హైమర్’. దీంతో ఈ మూవీ గురించి తెలియని వారికి కూడా ఈ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగిపోయింది.

2023 జూలై 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 900 మిలియ‌న్ల డాల‌ర్ల క‌లెక్షన్స్ కొల్లగొట్టింది. ఇంచుమించు 100 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిఈ సినిమాతో నిర్మాత‌ల‌కు తొమ్మిదో వంతు లాభాలు వచ్చాయి. అలా 2023 హాలీవుడ్‌లో అత్యధిక వ‌సూళ్లను రాబ‌ట్టిన మూడో సినిమాగా ‘ఓపెన్ హైమర్’ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక OTT విషయానికి వస్తే గత ఏడాది నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ రూ. 149 చెల్లించి ఈ సినిమాను చూడాలి. అలాగే ‘బుక్ మై షో’ ఓటీటీలో కూడా రూ. 199 చెల్లించి ఈ సినిమా వీక్షించవచ్చు. అయితే, ఇప్పుడు మరో ఓటీటీలోకి ఈ మూవీ రానుంది. ‘జియో’ సినిమా ఓటీటీలో మార్చి 21 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా జియో సినిమాలో దాదాపు చాలా సినిమాలు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసే వెసులుబాటు ఉంది. కానీ, పలు హాలీవుడ్ సినిమాలకు సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి. అలాగే ‘ఓపెన్ హైమర్’ చూడాలంటే జియో సినిమా ఓటీటీ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఉండాలి. ఇక ఇంగ్లీషుతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story