Janhvi Kapoor : తండ్రి బోనీకపూర్ కామెంట్స్ పై.. జాన్వీ ఫైర్

by Kavitha |   ( Updated:2024-02-25 06:48:59.0  )
Janhvi Kapoor : తండ్రి బోనీకపూర్ కామెంట్స్ పై.. జాన్వీ ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫోకస్ మొత్తం ప్రస్తుతం టాలీవుడ్ పై పెట్టింది. ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా హీరో తో నటించే ఛాన్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ‘దేవర’ మూవీతో ఎలాగైనా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా జాన్వీ కపూర్ కి సౌత్ లో మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చినట్లు ఇప్పటికే ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతుంది. అందులో బుచ్చిబాబు - రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఒకటైతే, సూర్య సరసన మరో ప్రాజెక్ట్ లో ఆమె నడుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వీటిపై మూవీ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

అయినప్పటికి బోనీ కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సూర్య,రామ్ చరణ్ లాంటి స్టార్లతో కూడా జాన్వీ నటించనుందని తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ విషయం పై జాన్వీ కపూర్ స్పందిస్తూ.. తండ్రి పై ఫైర్ అయింది ‘మా నాన్న ఎవరినీ సంప్రదించకుండా కొన్ని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో కూడా నాకు సరిగ్గా తెలియదు. దీని గురించి నాన్న నాతో గానీ, నిర్మాతలతో గానీ ఏమీ మాట్లాడలేదు’ అని పేర్కొంది. దీని బట్టి మూవీ టీం నుంచి అనౌన్స్మెంట్ రాకముందే తన తండ్రి ఇలా తాను చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి ఇంటర్వ్యూలో, బహిరంగంగా చెప్పడంతో జాన్వీ కపూర్‌ని తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed