- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mahesh Babu: ఒక్కడు రీరిలీజ్ డేట్ కన్‌ఫర్మ్.. ఎప్పుడో తెలుసా?
దిశ, సినిమా : మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు నెలలో రీరిలీజ్ చేసిన 'పోకిరి' సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే.. ప్రిన్స్‌ను కమర్షియల్ హీరోగా నిలబెట్టిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ఒక్కడు' కూడా ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. హీరోగా మహేశ్ ఇమేజ్, స్టార్‌డమ్‌ను రెట్టింపు చేసిన 'ఒక్కడు' కేవలం రూ.13 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా రూ.40 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఆ సమయంలో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది.
కాగా, ఈ మూవీని సంక్రాంతి పండగ సందర్భంగా 2023 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇదే సమయానికి ప్రభాస్ 'ఆదిపురుష్'తో పాటు చిరంజీవి-బాబి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'మెగా154' చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల పోటీ ఎలా ఉంటుందో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
Also Read : 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.. ట్రైలర్ లాంచ్ చేయనున్న Mahesh Babu