Jr NTR: ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగా.. మీ కాంబోలో ఒక్క సినిమా కావాలంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్

by Prasanna |   ( Updated:2024-09-10 14:13:16.0  )
Jr NTR:  ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగా.. మీ కాంబోలో ఒక్క సినిమా కావాలంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ మూవీకి డైనమిక్ డైరెక్టర్ శివ కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం దేవర సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది.. ఫ్యాన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం వేచి చూస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన జూనియర్ ఎన్టీఆర్ పేరే తెగ ట్రెండ్ అవుతుంది. అయితే, తాజాగా ఓ సెన్సేషనల్ డైరెక్టర్ తో కలిసిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

‘యానిమల్’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా తో జూనియర్ ఎన్టీఆర్‌ తో కలిసి మాట్లాడుతున్న ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది. వారిద్దరూ మాట్లాడుకుంటున్న స్టిల్‌ చూసిన సినీ లవర్స్‌.. ఏదైనా కొత్త సినిమాకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? అంటూ టాక్ నడుస్తుంది. కానీ, వీరు కలుసుకోవడం వెనుక ఎలాంటి ప్లాన్ లేదని.. కేవలం సరదా డిస్కషన్‌ అని కొందరూ అంటున్నారు.

ఇదిలా ఉండగా ఫ్యాన్స్ మాత్రం మీ ఇద్దరి కాంబోలో ఒక్క సినిమా పడితే మా ఎన్టీఆర్ అన్న ఎక్కడికో వెళ్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు వీరిద్దరూ కలిసి సినిమా తీస్తారో లేదో చూడాలి. ఇక ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించిన ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు ముంబైలో ట్రైలర్ ను గ్రాండుగా లాంచ్ చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed