Devara update: దేవర అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫొటో షేర్ చేస్తూ వెయిట్ చేయలేకపోతున్నానంటూ పోస్ట్

by Hamsa |
Devara update: దేవర అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫొటో షేర్ చేస్తూ వెయిట్ చేయలేకపోతున్నానంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, తారక్ కాంబోలో తెరకెక్కుతున్న ది మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘దేవర’. ఇందులో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ భామ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దేవర చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పార్ట్-1 సెప్టెంబర్ 27 వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది.

దేవర నుంచి ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన చుట్టమల్లె సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోందనడంలో అతిశయోక్తి లేదు. దీంతో దేవర మూవీపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇక ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఎన్టీఆర్ దేవర షూటింగ్ అప్డేట్ తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘‘దేవర పార్ట్ 1 కోసం నా చివరి షాట్‌ను ముగించాను.

ఇది ఎంత అద్భుతమైన ప్రయాణం. నేను ప్రేమ సముద్రాన్ని అద్భుతమైన బృందాన్ని కోల్పోతాను. సెప్టెంబర్ 27న శివుడు రూపొందించిన ప్రపంచంలోకి అందరూ ప్రయాణించే వరకు వేచి ఉండలేకపోతున్నా’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేకాకుండా షూటింగ్ సెట్ నుంచి ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. ప్రజెంట్ తారక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story