NTR రూ. 100 నాణెం అమ్మకాలు షూరు.. భారీగా క్యూ కట్టిన ఫ్యాన్స్..!

by Satheesh |   ( Updated:2023-10-06 08:46:36.0  )
NTR రూ. 100 నాణెం అమ్మకాలు షూరు.. భారీగా క్యూ కట్టిన ఫ్యాన్స్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా రూ. 100 స్మారక నాణెం విడుదల అయిన సంగతి విధితమే. అయితే ఈ నాణేన్ని చేజిక్కించుకోవడం కోసం ఎన్టీఆర్ అభిమానులు పోటీపడుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి అభిమానులు హైదరాబాద్, సైఫాబాద్ మింట్ మ్యూజియంలో నాణేల కోసం అభిమానులు క్యూ లైన్‌లలో నిలబడి ఎన్టీఆర్ వంద నాణెం చేజిక్కించుకుంటున్నారు. గంటల తరబడి లైన్‌లో నిలబడి నాణెం కొనుగోలు చేస్తున్నారు. ఎన్టీఆర్ రూ. 100 స్మారక నాణేన్ని మూడు ధరల్లో నిర్ణయించి మింట్ అధికారులు అమ్ముతున్నారు. రూ. 4,850, రూ. 4,380, రూ.4,050 గా ధరలు నిర్ణయించి అధికారులు గిఫ్ట్ బాక్స్‌తో ఆ నాణాన్ని అమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి : Jawan: ‘జవాన్’ నుంచి ‘రామయ్య వస్తావయ్యా’ సాంగ్ రిలీజ్..

Advertisement

Next Story