NTR and Prashant: మాస్‌ కాంబినేషన్‌ ఫిక్స్.. ‘దేవర’ పూర్తి కాకముందే స్టార్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ

by sudharani |
NTR and Prashant: మాస్‌ కాంబినేషన్‌ ఫిక్స్.. ‘దేవర’ పూర్తి కాకముందే స్టార్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ
X

దిశ, సినిమా: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజం చేస్తూ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌పైజ్ ఇచ్చారు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్. శుక్రవారం ‘NTR 31’ చిత్రం పూజకార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ట్స్‌ సంస్థల నిర్మాణంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌, నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజులు నిర్మిస్తున్న ఈ సినిమాను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎన్టీఆర్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సహా పలువురు హాజరయ్యారు. తార‌క్ భార్య లక్ష్మీ ప్రణతి కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఇక ఈ మూవీ జ‌న‌వ‌రి 09 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రక‌టించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ, సంగీతం: రవి బసూర్‌.

Advertisement

Next Story