9 సంవత్సరాలుగా రష్మీ సుధిర్‌తో కాకుండా అతనితో లవ్ ట్రాక్..సంచలన నిజాలు బయట పెట్టిన ఆటో రాంప్రసాద్

by Kavitha |   ( Updated:2024-05-20 05:31:51.0  )
9 సంవత్సరాలుగా రష్మీ సుధిర్‌తో కాకుండా అతనితో లవ్ ట్రాక్..సంచలన నిజాలు బయట పెట్టిన ఆటో రాంప్రసాద్
X

దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తర్వాత జబర్దస్త్ షో లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసే అల్లరి, డాన్స్‌లతో అందరిని ఆకట్టుకున్నది. దీంతో ఏకంగా వీళ్లిద్దరు లవ్ లో ఉన్నారనే వార్తలు కూడా హల్ చల్ చేశాయి. సోషల్ మీడియాలోనూ ఘాటైన ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారకు మతిపోగోడుతుంది. ఇక ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో రష్మీ యాంకర్ గా కొనసాగుతుంది.

ఇక ఇదిలా ఉంటే.. బుల్లితెరపై రష్మీ, సుధీర్ లవ్ స్టోరీకి ఒక సెపరేట్ ఫ్యాన్ క్రేజ్ ఉంది అనడంలో అతియోశక్తి లేదు. ఎమోషనల్ సీన్స్, ప్రపోజల్స్, ఎంగేజ్‌మెంట్, ఆఖరికి సుడిగాలి సుధీర్, రష్మి పెళ్లి చేసుకున్నట్టుగా కూడా అనేక ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి మల్లెమాల ప్రొడక్షన్స్ కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అందుకుంది. వీళ్ల ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ చూసి నిజంగానే వీళ్లు ప్రేమించుకుంటున్నారని.. ఆఫ్ స్క్రీన్ లో ఒకటవుదామని అనుకుంటున్నట్లుగా అప్పట్లో ఎన్నో వార్తలు హల్ కూడా చేశాయి. కానీ వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. అది కేవలం ప్రమోషనల్ స్టంట్ అని, స్వయంగా వీళ్లిద్దరు చెప్పినా.. పెళ్లి వార్తలు మాత్రం ఆగడం లేదు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా రష్మి లవ్ ట్రాక్ గురించి ఇన్ డైరెక్ట్ గా రామ్ ప్రసాద్ ఓ ప్రోగ్రాంలో చెప్పాడు. రష్మీ తొమ్మిదేళ్లుగా ట్రాక్ నడిపిస్తుందని.. అయితే ఎవరన్నది మాత్రం చెప్పలేదు. దీంతో చాలా మంది ఇంతకీ రష్మీ తొమ్మిదేళ్లుగా నడుపుతున్న లవ్ ట్రాక్ సుడిగాలి సుధీర్ యేనా లేకపోతే మరొకరా అని అనుకుంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed