- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకోవడం లేదు.. నాకు దాని కంటే అదే ముఖ్యం: హీరోయిన్ నేహాశెట్టి
దిశ,వెబ్ డెస్క్: కన్నడ బ్యూటీ నేహాశెట్టి ‘మెహబూబా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆకాష్ పూరీ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో నేహాశెట్టికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నటించిన సినిమాల్లో ఈ ముద్దుగుమ్మకు బ్రేక్ అయితే రాలేదు. 'డీజే టిల్లు’ మూవీలో రాధిక పాత్రకి తెలుగు ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత ఆమెను అందరూ రాధిక అని పిలవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నటిస్తున్నారు.
ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న హీరోయిన్లతో పోలిస్తే తక్కువ సినిమాలే చేస్తుంది. దీనికి గల కారణాన్ని తాజాగా నేహాశెట్టి చెప్పారు. తనకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని.. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకోవడం లేదని నేహాశెట్టి చెబుతున్నారు. మంచి సినిమాలు చేసి, మరింతగా ప్రేక్షకుల ఆదరణ పొందాలని నేహాశెట్టి ప్రయత్నిస్తున్నారట.