- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పాటియాలా కోర్టుకు Nora Fatehi.. మనీలాండరింగ్ కేసులో మరో ట్విస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ బాలీవుడ్ నటి, ఫేమస్ డాన్సర్ నోరా ఫతేహి రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో సోమవారం మరో సారి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. 2022, డిసెంబర్ 12న, నోరా ఫతేహీ సుఖేష్ చంద్ర శేఖర్ గల్ ఫ్రెండ్, ప్రముఖ బాలివుడ్ నటి జాక్వెలిన్‌పై పాటియాల కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జాక్వెలిన్ తనపై "గోల్డ్ డిగ్గర్" అంటూ తన కెరీర్‌ను నాశనం చేసేందుకు పరువు నష్టం కలిగించే విధంగా ఆరోపణలు చేసిందని ఆరోపించింది. ఈ క్రమంలోనే నోరా ఫతేహి సోమవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై దాఖలైన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని 164 కింద ఫతేహి తన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసింది.
మనీలాండరింగ్ కేసులో తన పేరు ప్రమేయం వల్ల ఉద్యోగ అవకాశాలు, పలుకుబడి, మానసిక సమస్యలు వచ్చాయని ఆమె పేర్కొంది. సుఖేష్‌కు సంబంధించిన ఈడీ కేసు నడుస్తోందని, దానితో నాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యక్తులు నాకు తెలియదని నోరా ఫతేహి అన్నారు. ‘వారు ఓ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. నేను బయటి వ్యక్తిని, నేను ఈ దేశంలో ఒంటరిగా ఉన్నందున, కొంతమంది వ్యక్తుల నా ప్రతిష్టను దెబ్బతీయడానికి నన్ను ఈ కేసులో బలిపశువుగా చేశారు’ అని ఆమె పేర్కొంది. ఇదిలా ఉండగా నోరా ఫతేహిని మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.