- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ గురించి చెప్పేందుకు మాటల్లేవు.. రాజమౌళిపై రేణూ దేశాయ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ‘బాహుబలి’ రిలీజై దాదాపు 8 ఏళ్లు పూర్తి కావోస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా అప్పట్లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచి.. రికార్డుల సునామీ సృష్టించింది. అయితే.. ఈ మూవీ రిలీజై సంవత్సరాలు గడుస్తున్నా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ క్రమంలోనే నార్వే దేశంలో స్టావెంజన్ థియేటర్లలో బాహుబలి ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకి రాజమౌళి, రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ ఈవెంట్‌కు రేణూ దేశాయ్, అకీరా నందన్‌కి సైతం ఆహ్వానం అందించారట బాహుబలి టీమ్.
దీంతో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలుపుకుంది రేణూ. ఈ మేరకు.. ‘‘ఒక భారతీయ చలనచిత్రం అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం చాలా అద్భుతమైన, లోతైన అనుభవం. రాజమౌళి, మీరు మా ప్రేక్షకుల కోసం సృష్టించిన వీక్షణ అనుభూతిని వర్ణించడానికి పదాలు లేవు. స్టావంజర్‌లో ఈ వాస్తవిక అనుభవం కోసం అకీరా, నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం’’ అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది.