- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ క్లాసికల్ డ్యాన్స్.. వీడియో వైరల్
దిశ, సినిమా: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక అంగరంగవైభవంగా సాగుతుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. వారం రోజుల నుంచి ఇదో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. చాలా మంది సెలబ్రెటీల డెస్టినేషన్ జామ్‌నగర్ అయిపోయింది. ముఖ్యంగా ఈ వేడుకలు ప్రారంభం నుంచి భారతీయ సంప్రదాయ పద్ధతిలో సాగుతుండటంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. భారతీయ వివాహాలు, అక్కడ చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ వివిధ ఆచారాలను కలిగి ఉంటాయి.. వాటన్నింటినీ అంబానీ ఫ్యామిలీ పాటించి వివాహం జరపనున్నారు.
ఇక ఈ ఈవెంట్ చివరి రోజున స్టార్స్ నుంచి అంబానీ కుటుంబ సభ్యుల వరకు సాంస్కృతిక ప్రదర్శన చేశారు. ఇందులో భాగంగా నీతా అంబానీ చేసిన డ్యాన్స్ మాత్రం అక్కడి అతిథులను మెస్మరైజ్ చేసింది. సంప్రదాయం, ఆధ్యాత్మికతకు మేళవిస్తూ సాగిన తన నృత్యం ఎంతో ఆకట్టుకుంది. శక్తి, సహనానికి ప్రతిరూపమైన దుర్గా దేవిని స్తుతిస్తూ సాగే పాటకు నీతా అంబానీ మంత్రముగ్ధులయ్యే ప్రదర్శన ఇచ్చింది. తన కొడుకు కోడలు.. అయిన అనంత్-రాధిక కోసం దుర్గ తల్లి ఆశీస్సులు కోరుతూ నీతా అంబానీ ఈ నృత్య ప్రదర్శన చేసింది. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Tags
- Nita Ambani