- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిండు నూరేళ్ల సావాసం.. లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసా?
దిశ, సినిమా: రోజురోజుకీ ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతున్నజీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ఒక ఆర్మీ లెఫ్టినెంట్ కుటుంబ కథతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అరుంధతి చనిపోవడంతో కథలో ట్విస్ట్ ఇచ్చిన ఈ సీరియల్ ఈరోజు(ఆగస్టు 31) ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకుందాం..
మనోహరి అరుంధతి పిల్లలను ఇబ్బంది పెట్టడం మొదలుపెడుతుంది. ఎలాగైనా పిల్లలను కూడా అమర్కి దూరం చేసి అరుంధతి స్థానంలో తాను చేరాలని అనుకుంటుంది. కానీ పిల్లలు అరుంధతిని మర్చిపోలేక అమర్, పిల్లలు చాలా బాధపడతారు. ఆత్మగా అక్కడే తిరుగుతున్న అరుంధతి వాళ్లని ఓదార్చలేక తానూ ఏడుస్తూ ఉంటుంది. అమర్ అరుంధతిని తలుచుకుని బాధపడుతుంటే మధ్యలో కలుగజేసుకుంటుంది మనోహరి. కానీ అమర్ ఆమెను పట్టించుకోకుండా బేస్క్యాంప్కి వెళ్లిపోతాడు.
అమర్తో గొడవపడి అక్కడనుంచి వెళ్లిపోతుంది భాగమతి. కిందపడిన అరుంధతి తాళిని చూసి భాగీని పిలుస్తాడు అమర్. పట్టించుకోకుండా వెళ్లిన భాగీకి తన చేతిలో తాళి లేదని గుర్తొచ్చి వెనక్కి తిరిగి వచ్చి అమర్ చేతిలోని తాళిని లాక్కుంటుంది. హాస్టల్కి వెళ్తున్న భాగమతికి రేడియో నుంచి కాల్ వస్తుంది. మళ్లీ తన స్లాట్లో భాగీనే ప్రోగ్రామ్ చెయ్యాలని బతిమాలుతాడు మేనేజర్ సరేనంటుంది భాగమతి.
బేస్క్యాంప్కి బయలుదేరిన అమర్ జీప్లో కూర్చోగానే రేడియో ఆన్ చేస్తాడు రాథోడ్. పది నిమిషాల్లో ఆర్జే భాగమతి ప్రోగ్రామ్ ఉందని అనౌన్స్ చెయ్యడంతో చిరాగ్గా రేడియో ఆపేయబోతాడు అమర్. కానీ అరుంధతికి భాగమతి ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టంఅని నచ్చజెప్పుతాడు రాథోడ్. తన కుటుంబం గొడవలో పడి భాగీని మర్చిపోయానని రేడియో స్టేషన్కి పరిగెడుతుంది అరుంధతి. అప్పుడే భాగీ కరుణతో కలిసి స్టేషన్కి వస్తుంది. అక్కడే తిరుగుతున్న అరుంధతి ఆత్మ భాగీకి కనపడుతుందా? భాగీ తన చేతిలో ఉన్న తాళి గురించి, తన కొడైకెనాల్ ప్రయాణం గురించి ప్రోగ్రామ్లో ఏం చెప్పబోతోంది? తెలియాలంటే ఈరోజు, ఆగస్టు31న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
Read More: నన్ను బిగ్ బాస్ 7 నుంచి పీకేశారంటూ వీడియో రిలీజ్ చేసిన మై విలేజ్ షో అనీల్