బాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న నిఖిల్ 'Karthikeya 2'

by Hamsa |   ( Updated:2022-08-18 05:09:48.0  )
బాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న నిఖిల్ Karthikeya 2
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 'కార్తికేయ-2'. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత ఆగస్టు 13న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సంచలనం సృష్టిస్తోంది. అయితే బాలీవుడ్‌లో మొదటి రోజు 50 థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ.. రెండో రోజుకు అమాంతం 200 థియేటర్స్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం 700 థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్‌లోని రెండు స్టార్ హీరోల సినిమాల షోస్‌ను రద్దు చేసినట్టు సమాచారం. అందులో అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', 1300 షోస్‌ను, అక్షయ్ కుమార్ నటించిన 'రక్షాబంధన్' 1000 షోస్‌ను రద్దు చేశారు.

ఆస్కార్ రేసులో నాని 'Shyam Singha Roy'

Advertisement

Next Story