Niharika Konidela : ఆంధ్రాలో రద్దైన నిహారిక ఓటు.. కారణమేంటో తెలియదంటున్న మెగా డాటర్

by Anjali |   ( Updated:2024-03-13 15:42:17.0  )
Niharika Konidela : ఆంధ్రాలో రద్దైన నిహారిక ఓటు.. కారణమేంటో తెలియదంటున్న మెగా డాటర్
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలు వెల్లడించింది. పొలిటికల్ యాక్టివిటీ గురించి మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించగా.. ‘‘ఈ సారి కచ్చితంగా జనసేన పార్టీ విజయం సాధించాలి. అందుకోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. నాకు ఆంధ్రలోనే ఓటు ఉంది. కానీ నా ఓటును రద్దు చేశారు. ఎందుకో కారణం కూడా తెలియదు. ఆంధ్రాలో మేం ఇల్లు కొనాలనుకుంటున్నాం. మా నాన్న పోటీ చేయడం ఫిక్స్ అయితే అక్కడ తప్పకుండా ఇల్లు కొంటాం.

ఒకవేళ చేయకున్నా ఎక్కడో ఒక దగ్గర ఇల్లు తీసుకోవాలి. నాన్న రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ విషయం గురించి మాట్లాడుదాం అనుకుంటే. ఇంటికొచ్చినా 5 నిమిషాలు ఉంటున్నారు అంతే. నాన్నతో మాట్లాడటానికి అసలు టైం ఉండట్లేదు’. అంటూ నిహారిక వెల్లడించింది. ఇక పవన్ కల్యాణ్ పాలిటిక్స్ గురించి అడగ్గా.. బాబాయ్ చాలా కష్టపడుతున్నారు. అటు సినిమాలు కూడా చేయాలి. ఎందుకంటే ఆయనకు ఇంకేమి ఆస్తులు లేవు. మూవీల్లో నటించిన మనీతోనే పార్టీ నడపాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. అంటూ నిహారిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed