- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలు కావాలంటున్న నిహారిక..ఇన్ డైరెక్ట్‌గా లవ్ మ్యారేజ్‌పై ఓపెన్ అయినట్లేనా?
దిశ, సినిమా : మెగా డాటర్ నిహారిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఈమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఒక మనసు సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ, ప్రస్తుతం వెబ్ సిరీస్‌లను నిర్మిస్తుంది. అయితే తాజాగా నిహారిక సాగు అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రజంటర్‌గా వ్యవహరించింది. సాగు మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ క్రమంలో సాగు మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిహారిక పిల్లలు, లవ్ మ్యారేజ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టమని చెప్పింది. అంతే కాకుండా లైఫ్ అనేది ఒక సైకిల్. సాగు మూవీలో అదే చూపెట్టబోతున్నామంటూ పేర్కొంది. దీంతో యాంకర్ అంటే మిమ్మల్ని మళ్లీ పెళ్లి కూతురుగా చూడొచ్చా అని ప్రశ్నించగా.. అమ్మో..అది తెలియదు కానీ, నేను పిల్లలు కావాలి అనుకుంటున్నాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి. పిల్లలనే చెప్పలేం కానీ, నాకు లవ్ మీద మాత్రం ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ లేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ఇది చూసిన నెటిజన్స్..నిహారిక లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని ఇండైరెక్ట్‌గా చెప్పుకొచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.