- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ కేసు: కొత్త లిస్ట్‌లో నిహారిక పేరు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. బంజారాహిల్స్ లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ ఫుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల కొడుకులు, కూతుళ్లు పట్టుబడినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో సినీ నటి నిహారికతో పాటు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్ లకు పోలీసులు నోటీసులు పంపడం సంచలనంగా మారింది.
అయితే ఈ పబ్ లో జరిగిన పార్టీలో పాల్గొన్న 142 మంది పేర్లతో కూడిన లిస్ట్ ను పోలీసులు విడుదల చేశారు. కానీ ఈ లిస్ట్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, గల్లా సిద్దార్థ్ తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. కానీ ఈ లిస్ట్ లో నిహారిక పేరు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు కొత్త లిస్టులో నిహారిక పేరును పోలీసులు చేర్చారు. లిస్ట్ లో నిహారిక పేరు ఉండటంతో మెగా ఫ్యామిలీలో టెన్షన్ నెలకొంది.