- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులపై ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చిన నిహారిక..! షాక్‌లో మెగా అభిమానులు?
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా మెగా డాటర్ నిహారిక కొణిదెల- చైతన్య విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నిహారిక విడాకుల న్యూస్ మరోసారి తెరపైకి వచ్చింది. నిహారిక, చైతన్య మధ్య మనస్పర్థలు వచ్చినట్లు.. విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ వాటిపై మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. అంతే కాకుండా ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగినట్లు అవి ఫలించి నిహారిక, చైతన్య కలిసిపోయారన్న వాదనలు కూడా వినిపించాయి. ఈ న్యూస్‌తో మెగా అభిమానులు ఎంతో ఆనందించారు. కానీ, ఈ లోపే మరో వార్త వారిని కలవరపెడుతుంది.
నిహారిక భర్త చైతన్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి తన పెళ్లి ఫొటోలను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో నిహారిక కూడా తన పెళ్లి ఫొటోలను డిలీట్ చేసింది. కొన్ని అరుదైన ఫొటోలను మాత్రమే ఉంచి.. మిగిలినవి ఇన్‌స్టా నుంచి తొలగించారు. హల్దీ ఫంక్షన్ ఫొటో, అమ్మ నిశ్చితార్థం చీర కట్టుకున్న ఫొటో ఇలా తన పెళ్లికి సంబంధించి రెండు మూడు ఫొటోలు మాత్రమే ఇన్‌స్టాలో ఉన్నాయి. దీంతో నిహారిక తన విడాకుల విషయంలో పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ కథనాలు వెలువడుతున్నాయి. చైతన్య, నిహారిక విడాకులు తీసుకోవడం ఖాయమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో వేచి చూడాల్సి ఉంది.
Read more: