Devara : దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు రెండు కాళ్ళు ఉండవా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-08-03 06:45:12.0  )
Devara : దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు రెండు కాళ్ళు ఉండవా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
X

దిశ, సినిమా : ప్రస్తుతం అందరి కళ్లు దేవర పైనే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో, అతిలోక సుందరి గారాల పట్టీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా,పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెంకండ్ సింగిల్ రాబోతుంది. సెకండ్ సింగిల్ డేట్ అనౌన్స్ చేస్తూ మూవీ టీం, ఎన్టీఆర్, జాన్వీల రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఈ పోస్టర్ బారీ ట్రోలింగ్‌కు గురి అవుతుంది. స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతి చిన్నదాన్ని కూడా గమనిస్తుంటారు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా ఇది. దీంతో అందరి కళ్లు ఈ మూవీపైనే ఉన్నాయి.అయితే తాజాగా రిలీజ్ చేసిన దేవర పోస్టర్‌పై ట్రోలర్స్ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. దేవకన్యలా జాన్వీ, తారక్ కూల్ లుక్స్‌తో ఉన్న పోస్టర్ చాలా మందిని ఆకట్టుకోగా, దీనిపై ట్రోలర్స్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. పోస్టర్‌లో ఎన్టీఆర్ కాళ్లు సగమే కనిపిస్తాయి, పాదాలు కనిపించవు. దీంతో పోస్టర్‌‌లో ఎన్టీఆర్ కాళ్ళు మాయమయ్యాయి. అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ విషయాన్ని గమనించకపోవడం ఏంటీ, అసలు ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు కాళ్లు ఉండవా ఏంటీ, అసలు కాళ్లు ఎక్కడికి పోయినట్లు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story