నాలుగు అడుగులు లేవు పతివ్రత మాటలు మాట్లాడకు అంటూ నెటిజన్ కామెంట్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన మాధవీలత!

by Hamsa |   ( Updated:2024-03-20 10:11:04.0  )
నాలుగు అడుగులు లేవు పతివ్రత మాటలు మాట్లాడకు అంటూ నెటిజన్ కామెంట్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన మాధవీలత!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె నచ్చావులే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. మొదటి మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె స్నేహితుడా, అరవింద్-2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ సినీ కెరీర్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి జాతీయ పార్టీలో చేరింది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాధవీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి సామాజిక అంశాలపై పలు కామెంట్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

ఈ క్రమంలోనే ఇటీవల ఓ అంశంపై మాధవీలత తనదైన స్టైల్లో స్పందిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. ‘‘పతివ్రత మాటలు మాట్లాడకు తల్లి. నీ బతుకు సినిమా మేనేజర్లను అడిగితే చెప్తారు. నీ వేషాలకు ఎన్ని తిరుగుళ్లు తిరిగావో తెలుసులే. నాలుగు అడుగులు ఉండవు మాటలు పతివ్రతలా మాట్లాడుతావు’’ అని కామెంట్ పెట్టాడు. ఇక అది చూసిన మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ ఇది చాలా ఫన్నీ కామెంట్.. ఆఫర్ల కోసం నేను మేనేజర్స్‌ను అడిగితే చెప్తారు. అలా పోవడానికి మేనేజర్స్‌కు ఎందుకు? నాకు తెలిసిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరు ఇండస్ట్రీలో నా స్థాయికి పర్సనల్ కాల్స్ చేస్తే చాలుగా అంకుల్. అలా పోయి ఉండేదాన్ని అయితే ఇప్పటికీ స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని’’ అంటూ స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసింది. ప్రస్తుతం మాధవిలత పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Read More..

హాట్ ఫోటోషూట్‌తో సెగ‌లు రేపుతోన్న మిల్కీ బ్యూటీ తమన్నా

Advertisement

Next Story

Most Viewed