పాపం.. తమన్ మళ్ళీ అదే తప్పు చేశాడా!

by Hamsa |   ( Updated:2022-11-26 14:27:27.0  )
పాపం.. తమన్ మళ్ళీ అదే తప్పు చేశాడా!
X

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. ఆయన చేతిలో డజన్ల కొద్ది సినిమాలున్నాయి. అయితే తమన్ నుంచి ఏ సాంగ్ వచ్చినా ఎక్కడో విన్నట్టు ఉంటుంది అంటూ.. ఇంతకు ముందు తమన్ సంగీతం పై చాలా ట్రోల్స్ వచ్చాయి. కాపీ కంటెంట్ అంటూ ఒరిజినల్ సాంగ్ ని లేటెస్ట్ పాట తో కంపేర్ చేసి వీడియోల తో ట్రోల్స్ చేశారు. రీసెంట్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' సినిమాకు తమన్ సంగీతం అందించాడు. కాగా.. ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే ఈ పాటలో లిరిక్స్ తర్వాత వచ్చే జై బాలయ్య జై జై బాలయ్య అనేది. గతంలో వచ్చిన 'ఒసేయ్‌ రాములమ్మ' సినిమాలోని పాటను పోల్చి ఉండటంతో నెటిజన్లు మళ్లీ తమన్‌ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. గట్టిగా దొరికిపోయావు అంటూ, సోషల్ మీడియాలో డిఫరెంట్ వీడియోస్ , మీమ్స్ తో తమన్ ను ఆడేసుకుంటున్నారు.

Read More: " ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం " Itlu Maredumilli Prajaneekam సినిమాలో మైనస్ పాయింట్స్ ఇవే !

Google లో అత్యధికంగా ఈ సెలబ్రిటీల కోసమే సెర్చ్ చేస్తున్నారంటా..!

Advertisement

Next Story