- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్ ‘లియో’ ఓటీటీ రిలీజ్ డేట్స్ రెండు ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్.. ఇదేం ట్విస్ట్ ..!
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘లియో’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో రిలీజై భారీ విజయం సొంతం చేసుకుంది. ఓవరల్ గా రూ.600 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. త్రిష హీరోయిన్‌గా, సంజయ్‌దత్, అర్జున్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాలోని ఎలివేషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మూవీ OTT కి సంబంధించి రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించడం జరిగింది.
నవంబర్ 24న తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘లియో’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కాగా ఈ మూవీ ఓటీటీ హక్కులను దాదాపు రూ. 120 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు డేట్లు ఏంటంటే ఇండియాలో ఈ సినిమా నవంబర్ 24న OTT స్ర్టీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించగా.. గ్లోబల్ వైడ్‌గా మాత్రం నవంబర్ 28 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు అనౌన్స్ చేశారు.