విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ

by sudharani |   ( Updated:2023-07-21 06:36:41.0  )
విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఉదయనిధి స్టాలిన్ హీరోగా, స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘మామన్నన్’. తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. తమిళనాడులో జూన్-29న రిలీజై మంచి విజయాన్ని దక్కించుకుంది. దాదాపు రూ. 60కోట్లు వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా దూసుకుపోయింది. ఇక తెలుగులో ‘నాయకుడు’ అనే పేరుతో జూలై-14న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్లు మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. అయితే.. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ‘మామన్నన్’ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ బాషల్లో జూలై-27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

‘Read More: The Kerala Story’ ఓటీటీలో ఎందుకు రాలేదో తెలుసా?

Advertisement

Next Story