Natural Star Nani: "తగ్గేదే లే" అంటున్న నేచురల్ స్టార్ నాని

by Prasanna |   ( Updated:2023-03-01 05:32:37.0  )
Natural Star Nani: తగ్గేదే లే అంటున్న నేచురల్ స్టార్ నాని
X

దిశ, వెబ్ డిస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో హీరోల రేంజ్ సినిమా సినిమాకు మారుతుంది. సినిమా హిట్ అయినప్పుడు ఉండే జోష్ ప్లాప్ వచ్చినప్పుడు అస్సలు కనిపించదు. అందుకే మన హీరోలు ఈ మధ్య కాలంలో ఆచి తూచీ అడుగులు వేస్తున్నారు. కానీ ఈ హీరో మాత్రం మిగతా హీరోల కంటే భిన్నంగా ఉన్నాడు. సెట్స్ పై ఉన్న విడుదల కాక ముందే వరుస సినిమాలకు లైనులో పెట్టేస్తున్నాడు. ఆ హీరో ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదండి నేచురల్ స్టార్ నాని.

టాలీవుడ్లో హిట్స్ , ఫ్లాప్స్ తో సంబందం లేకుండా మంచి ప్లానింగ్ తో దూసుకుపోతున్న హీరో నాని. దసరా సినిమా అంటూ కంప్లిట్ మాస్ మసాలా మూవీ చేసాడు . మార్చి 30 న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కొత్త ప్రాజెక్ట్స్ ను లైనులో పెట్టాడు. దసరా సినిమా ప్రమోషన్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు. ఆ తరువాత హను రాఘవ పూడి చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సూపర్ హిట్ అయ్యింది. సీతా రామం తరువాత హను ఎంచుకున్న ప్రాజెక్ట్ ఇది. హిట్ 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న శైలేష్ కొలను HIT 3 సినిమా నానితో చేయబోతున్నారు. ఇలా నాని వరుస ప్రాజెక్ట్స్ కు ఒకే చెబుతూ కెరియర్ను గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

Also Read: Pan India Movies: పండగే పండుగ.. ఒకే రోజు రెండు భారీ సినిమాల నుంచి అప్డేట్?

Advertisement

Next Story

Most Viewed