- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘NATS’ ఆధ్వర్యంలో ప్రముఖుల శతజయంతి ఉత్సవాలు!
దిశ, సినిమా: ప్రముఖ గాయకుడు ఘంటసాల, నవ్వుల రాజు అల్లు రామలింగయ్య, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు.. ఈ ముగ్గురి శతజయంతి ఉత్సవాలు మే 26, 27, 28 తేదీల్లో న్యూజెర్సీలో ఘనంగా జరపడానికి రంగం సిద్ధం చేసింది నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు సమితి). కాగా ఈ వేడుకల గురించి తెలుగు అభిమానులకు తెలిపేందుకు హైదరాబాద్‌లోని పార్క్‌హయాత్ హోటల్లో ప్రెస్‌మీట్ పెట్టారు. నాట్స్ ప్రెసిడెంట్ బాపు నూతి, కన్వీనర్ శ్రీధర్ అప్పసాని, డిప్యూడి కన్వీనర్ రాజ్ అల్లాడల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత అల్లు అరవింద్, సహజనటి జయసుధ, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, సాయికుమార్, అలీ, ఆది సాయికుమార్, అవసరాల శ్రీనివాస్, ఎ.కోదండరామి రెడ్డి, బి.గోపాల్, గోపిచంద్ మలినేని, సిరాశ్రీ, గాయకులు సింహ, దినకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బాపు నూతి.. ‘అమెరికాలో ఉండి మన తెలుగువారి బాగోగులను దగ్గరుండి చూసుకుంటుంది నాట్స్. తెలుగు వాళ్లకోసం సామాజిక, ఆర్థిక సంక్షేమాన్ని సమకూర్చి మేమున్నామన్న ధైర్యాన్ని, భరోసాని ఇస్తుందని సగర్వంగా చెప్తున్నాను. అలాగే ఈ ఏడాది ఉత్తర అమెరికా తెలుగు సంబురాలులో భాగంగా మన తెలుగు పెద్దల శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేసుకుని ఇండియాకి వచ్చాం. ఈ ఈవెంట్‌లో పాల్గొనటానికి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు ఎంతో మంది అమెరికాకి వచ్చి న్యూజెర్సీలో జరిగే వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పటానికి ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు.
‘ఈ ఏడాది మేము చేస్తున్న ఈ సంబురాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగు సినిమాకు గొప్ప సేవలందించిన ఆ ముగ్గురు మహనీయుల శతజయంతి ఉత్సవాలతోపాటు, నటులుగా (గోల్డెన్‌జూబ్లి) 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్న జయసుధ, సాయికుమార్‌లను మా వేదికపై సత్కరించాలని నిర్ణయించుకున్నాం. గతంలో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఏడాది చేసే కార్యక్రమాలకు ఎంతో విశిష్టత చేకూరనుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌ను సత్కరించే అవకాశం నాట్స్‌కి రావటం ఆనందంగా ఉంది’ అని శ్రీధర్ అప్పసాని చెప్పారు.
డిప్యూటీ కన్వీనర్ రాజ్ అల్లాడ మాట్లాడుతూ.. ‘అమెరికాలోని తెలుగు వారికే కాదు.. ఇండియాలోని తెలుగు వారికి కూడా మా సంస్థ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మా ఫండ్స్ నుంచి దాదాపు 25 శాతం సొమ్మును సామాజిక సేవకోసం పలు స్వచ్చంధ సంస్థలకు కేటాయిస్తున్నాం. తెలుగువారు అమెరికాలో ఉన్నా.. ఇండియాలో ఉన్నా.. వారిని ఆదుకోవడమే మా సంస్థ లక్ష్యం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యూత్‌ని ఎంకరేజ్ చేయటానికి సీ.ఎక్స్.ఓ ఫోరంను నిర్వహించి యంగ్‌టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాం’ అని తెలిపారు.
‘తెలుగు భాషకి పట్టాభిషేకం చేస్తున్న నాట్స్ వారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. నేను గతంలో అనేకసార్లు నాట్స్ వేడుకల్లో పాల్గొన్నాను. ఈసారి వేడుకల్లో పాల్గొనటం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. కారణమేమిటంటే ఘంటసాలగారి దగ్గరికి మా నాన్నగారు పి.జె శర్మగారు ఒకసారి తీసుకెళ్లారు. అక్కడ నేను ధుర్యోధనుడి డైలాగ్స్ చెప్పి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అల్లు రామలింగయ్యగారితో నేను బాపుగారి దర్శకత్వంలో నటించటం జరిగింది. ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన సంసారం సినిమాతో నా డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది’ అని తన అనుబంధాలను గుర్తు చేసుకున్నారు సాయికుమార్. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘మా నాన్నగారు అల్లు రామలింగయ్యగారి శతజయంతి ఉత్సవాలను అమెరికాలో నిర్వహించటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నాతోపాటు నా స్నేహితుడైన డాక్టర్ రమేశ్ కంచర్ల, కిశోర్ కొత్తపల్లి కూడా ఈ సంబురాల్లో పాల్గొంటున్నారు’ అని చెప్పాడు.
మంచి కార్యక్రమాలు చేస్తున్న నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వారి కార్యక్రమంలో నేను పాల్గొనటం ఆనందంగా ఉందని జయసుధ చెప్పగా.. ‘నాట్స్‌తో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. 2009 నుంచి నేను వారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా’ అని అలీ చెప్పాడు. వీరితోపాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ‘నాట్స్ 2023’ సంబరాల్లో పాల్గొనటానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్‌కి వెగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, వైకుంట డెవలపర్స్, వాడిలాల్, జీ అండ్ సి అలకనంద రివర్ ఫ్రంట్, డెలీకోస్, తెలుగు ఫుడ్స్, ర్యాస్‌బెర్రీస్, అవిజ్ఞా గోల్డ్ స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నారు. నటి, నిర్మాత ప్రవీణా కడియాల ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్‌గా వ్యవహరించారు.