- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Allu Arjun: కాంతార హీరో రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)
దిశ, సినిమా: అత్యంత ప్రతిష్టాత్మకంగా అనుకునే జాతీయ చలన చిత్ర అవార్డుల లిస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు అవార్డులు లభించాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా కార్తికేయ-2కు అవార్డు రాగా.. తిరు సినిమాకు గాను నిత్యా మీనన్ విజేతగా నిలిచింది. అంతేకాకుండా కాంతార మూవీలో రిషబ్ శెట్టి నటనకు జాతీయ అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయనకు పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా, రిషబ్ శెట్టిపై అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘‘జాతీయ అవార్డు విజేతలందరికీ అభినందనలు. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టి అవార్డు విజేతగా నిలిచారు. అలాగే ఇందులో నా చిరకాల స్నేహితురాలు నిత్యా మీనన్‌కు అవార్డు వచ్చినందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. జాతీయ అవార్డు గ్రహీతలందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. కార్తికేయ-2 సినిమా విజయం సాధించినందుకు టీమ్ అందరికీ శుభాకాంక్షలు’’ అని వరుస పోస్టులు పెట్టాడు.
Click here for Allu Arjun Twitter post : https://x.com/alluarjun/status/1824660512841535951