ఆ మూవీ సీక్వెల్‌తో Nara Rohith రీ ఎంట్రీ.. ఆకట్టుకుంటున్న ప్రీ లుక్‌ పోస్టర్‌

by Dishaweb |   ( Updated:2023-07-25 12:27:38.0  )
ఆ మూవీ సీక్వెల్‌తో Nara Rohith రీ ఎంట్రీ.. ఆకట్టుకుంటున్న ప్రీ లుక్‌ పోస్టర్‌
X

దిశ, సినిమా: పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఫీలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నారా రోహిత్ ‘సోలో’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కానీ ఆయనకు ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు దక్కలేదు. ఇన్నాళ్లకు మళ్లీ నారా రోహిత్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తొమ్మిదేళ్ల కిందట ‘ప్రతినిధి’ సినిమాకు సీక్వెల్‌తో వస్తున్నాడు. సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి దర్శకత్వం వహించబోతున్నా ఈ సినిమా ఏపిలో రానున్న ఎన్నికల దృష్ట్యా తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినపడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ప్రీ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తిచేసుకున్నా ఈమూవీ త్వరలోనే సెట్స్‌‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

Also Read: అశ్విన్ బాబు ‘హిడింబ’ 3 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Advertisement

Next Story