- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భోళాశంకరుడి ఆశీస్సులు రాష్ట్రప్రజలపై ఉండాలి: బాలకృష్ణ
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: 'హరహర మహాదేవ శంభోశంకర' అంటూ యావత్ ప్రపంచమంతా శివనామ స్మరణతో మార్మోగే ఈ మహాశివరాత్రి పర్వదినం రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలి అని అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. జీవకోటి రాసుల సృష్టికర్తగా పిలువబడే శివనాథుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని వేడుకున్నారు. భూతనాధుడైన ఆ శంకరుడు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల నుండి విడిపించి.. మనశ్శాంతిని, సుఖశాంతులను ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. భోళాశంకరుడు తన మెండైన దీవెనలతో ఈ దేశ ప్రజలను అష్టైశ్వర్యాలతో దీవించాలని ప్రార్థిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.
Next Story