- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
namrata shirodkar: గార్జియస్ లుక్‌లో నమ్రత.. క్యూట్‌నెస్ ఓవర్ లోడేడ్ అంటున్న నెటిజన్స్
దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెదట్లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నమ్రత ఆ తర్వాత యాడ్స్ చేసి అనంతరం సినిమాల్లోకి వచ్చింది. 1998లో ‘మేరే దో అన్మోల్ రతన్‘ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీతో పాటు తెలుగు, మలయాళ వంటి భాషల్లో కూడా నటించింది. ఈ నేపథ్యంలోనే 2000లో టాలీవుడ్ మహేష్ బాబు సరసన ‘వంశీ’ చిత్రంలో నటించింది. ఈ సినిమా ఫ్లాపైనప్పటికి వారి ప్రేమకి మాత్రం బీజం వేసింది. ఇక వంశీ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. చివరిగా 2004లో ఓ సినిమా చేసిన నమ్రత మళ్లీ అటు వైపు దృష్టి పెట్టలేదు. ఇక మహేష్ బాబు భార్య అయినా సింపుల్‌గా ఉండటానికి నమ్రత ఇష్టపడతారు. మహేష్ సినిమాలు సక్సెస్ కావడానికి నమ్రత తన వంతు కృషి చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
తాజాగా నమ్రతా ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ డ్రెస్ వేసుకొని గార్జియస్ లుక్‌లో స్టిల్స్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు క్యూట్‌నెస్ ఓవర్ లోడేడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరీ మీరు ఓ సారి వాటిపై లుక్ వేసేయండి.
(video link credits to namrata shirodkar instagram id)