- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లేడీ బాస్ లుక్‌లో దర్శనమిచ్చిన నమ్రతా శిరోద్కర్.. పిక్స్ వైరల్
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్-నమ్రత వంశీ సినిమాలో కలిసి నటించి.. లవ్‌లో పడ్డారు. అనంతరం కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వివాహనంతరం నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పి.. కేవలం సూపర్ స్టార్ భార్యగా మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తుంది. నమ్రత తరచూ పిల్లలు.. గౌతమ్-సితార ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.
అప్పుడప్పుడు నమ్రత శిరోద్కర్ కూడా ట్రెండింగ్ లుక్ లో దర్శనమిస్తుంది. తాజాగా ఈమె లేడీ బాస్ గెటప్ లో సూపర్ స్టైలిష్‌గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ గెటప్‌లో నమ్రత కాస్త యంగ్‌గా కనిపించడంతో మీకు 52 ఏళ్లా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యంగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నమ్రత శిరోద్కర్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.