- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పాత్రలో నటిస్తే మాత్రం ఊరుకోనంటూ నాగార్జునకు వార్నింగ్ ఇచ్చిన తండ్రి..!
దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏఎన్ఆర్, ఎన్టీఆర్ రెండు కళ్ళ లాంటి వారు. వీళ్ళిద్దరూ అప్పట్లో తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో ఎంతో కృషి చేశారు. తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే డామినేషన్లను తట్టుకొని మరి తెలుగు సినిమా రేంజ్‌ని పెంచడంలో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు చేయని పాత్ర అంటూ లేదు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రతి మూవీని పంచుకుని నటించేవారు. అలా ఇద్దరి కాంబోలో వచ్చిన ప్రతి ఒక మూవీ సూపర్ హిట్ అయింది. అందుకే ఇప్పటికీ మన టాలీవుడ్ పరిశ్రమ స్థిరంగా నిలబడగలుగుతుంది.
ఇక వారు ఇండస్ట్రీకి వారి వారసులను పరిచయం చేసి తప్పుకున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట్లో వరుస ప్లాప్‌లను ఎదుర్కోన్నప్పటికీ ఆ తర్వాత ‘శివ ‘ లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అప్పటి నుండి తిరిగి వెనక్కి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు.. ‘ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నాన్న కొన్ని మాటలు చెప్పాడు. ఇక్కడ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది కామన్. వాటిని చూసి పొంగిపోకుండా, కృంగిపోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఎలాంటి పాత్ర చేసిన పర్లేదు. కానీ నువ్వు స్టార్ హీరో అయ్యేంత వరకు ‘గే’ పాత్రను మాత్రం చేయకు అని చెప్పారు. ఎందుకంటే ఒక స్టార్ హీరో అవ్వాల్సిన వాళ్ళు అలాంటి పాత్రలు చేస్తే ఆడియన్స్ దృష్టిలో చాలా తక్కువగా కనిపిస్తారని దానివల్ల హీరోగా కెరియర్‌కు భారీ దెబ్బ పడుతుందని చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.
Read More..
వివాదాస్పదంగా మారిన హీరో సిద్దార్థ్ ట్వీట్.. ఎట్టకేలకు దిగొచ్చి క్లారిటీ ఇచ్చేసిన లవర్ బాయ్!