- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
20 నిమిషాల కోసం కోట్లిచ్చి రమ్మంటున్నారు.. నెట్టింట దుమారం రేపుతోన్న నాగార్జున కామెంట్స్
దిశ, సినిమా: భారత దిగ్గజ వ్యాపారవేత్త, కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం ప్రీ వెడ్డింగ్ వేడుకలకే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారని వార్తలు బయటకు రావడంతో దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ వేడుకలకు కేవలం ఇండియాలోని సెలబ్రెటీలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, టెక్ నిపుణులు, కుబేరులు సందడి చేశారు. ముఖ్యంగా ఫేస్‌బుక్ అధినేత మార్క జూకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హాజరు కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ముంబైలోని జామ్‌నగర్‌లో ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీ పెళ్లి జరగబోతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కొందరు వ్యాపారవేత్తలు కోట్లు ఇచ్చి సెలబ్రిటీలను తమ పెళ్లిళ్లకి ఆహ్వానిస్తున్నారని, ఇది విచిత్రంగా ఉందని నాగ్ వెల్లడించారు. అయితే నాగార్జున చేసిన కామెంట్లు ఇప్పటివి కావు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తాజాగా.. ముఖేష్ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్‌కి ఇంత మంది స్టార్స్ పాల్గొన్న నేపథ్యంలో నాగ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పెళ్లికి గెస్ట్‌గా వెళ్లి 20 నుంచి 30 నిమిషాలు టైమ్ స్పెండ్ చేస్తే చాలు కోట్లకు కోట్లు ఇస్తున్నారని నాగార్జున వ్యాఖ్యానించారు. దీంతో నాగ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చరణ్‌తో పాటు బాలీవుడ్ అగ్రహీరోలైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్‌లు కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
Read More..
అలా బ్రతకడం తెలిసిన ఏకైక జీవి.. దర్శకుడు ఆర్జీవీ : కోన వెంకట్