- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హనుమాన్’ రివ్యూ ముందే చెప్పిన మెగా బ్రదర్ నాగబాబు.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘హనుమాన్’. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, ట్రైలర్, టీజర్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకు మెగా బ్రదర్ నాగబాబు బెస్ట్ విషెస్ తెలియజేశాడు.
‘‘చూడాలనివుంది' సినిమాలో ఊహ తెలియని వయసులోనే నీ నటనతో అందరినీ అలరించావు. అప్పట్లోనే అన్నయ్య చిరంజీవికి బుల్లిమెగా ఫ్యాన్‌గా నాకు కనిపించావు. Child Artist గా ఎన్నో సినిమాల్లో మెప్పించావు. అదే పంధాలో హీరోగా మొదటి సినిమా 'జాంబిరెడ్డి' తోనే విభిన్న కథనంతో విజయాన్ని సాధించావు. మరో వైవిధ్యమైన Mythological Fantasy జోనర్‌తో వస్తున్నావు. ట్రైలర్ విజువల్స్ లోనే చిత్ర విజయం ఖరారనిపిస్తోంది. కథానాయకుడిగా చిత్ర పరిశ్రమలో నీ ప్రయాణం ఎన్నో మైలు రాళ్లు చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. నీ రెండో చిత్రమైన "హనుమాన్" కోసం చాలా Excited గా ఎదురు చూస్తున్నాను’ అంటూ విషెస్ తెలియజేశాడు. నాగబాబు ఈ చిత్ర విజయం ఖరారు అన్నట్లుగానే.. ‘హనుమాన్’ మూవీ ప్రజెంట్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.