NagaBabu: నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా: ‘ఆర్ఆర్ఆర్’కు మద్ధతుగా నాగబాబు

by Prasanna |   ( Updated:2023-03-15 03:18:29.0  )
NagaBabu: నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా: ‘ఆర్ఆర్ఆర్’కు మద్ధతుగా నాగబాబు
X

దిశ, సినిమా : ఆస్కార్స్ పబ్లిసిటీ కోసం ‘ఆర్ఆర్ఆర్’ భారీగా ఖర్చుపెడుతుందన్న విమర్శలపై నటుడు నాగబాబు ఘాటుగా స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయిన ఆయన.. ‘నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు RRRకి ఆస్కార్ కోసం. #RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం’ అంటూ తనదైన స్టైల్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నాగబాబుకు మద్ధతుగా నిలుస్తున్న ఫ్యాన్స్.. ‘కరెక్ట్ టైమ్‌లో పర్ఫెక్ట్ షాట్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ‘కొంతకాలంగా ప్రపంచ సినిమా పటంపై తెలుగు సినిమా రారాజుగా వెలుగొందుతుందంటే అందుకు కారణం ‘RRR’. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతూ గంటల తరబడి ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్‌తో మాట్లాడుతుంటే.. కొంతమంది తెలుగువాళ్లు చీప్‌గా మాట్లాడటం ఏమిటో వారికే తెలియాలి. అందులోనూ సినిమా మేకర్స్ కూడా మాట్లాడటం విడ్డూరమే’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Samantha: బోల్డ్ సీన్స్‌లో సమంత.. అంత హాట్‌గా కనిపించేందుకు ఓకే చెప్పినట్టేనా..?

Advertisement

Next Story