Naga Vamsi: విజయదేవరకొండ ‘VD 12’ మూవీ రెండు పార్టులా? షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత..

by Kavitha |
Naga Vamsi: విజయదేవరకొండ ‘VD 12’ మూవీ రెండు పార్టులా? షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత..
X

దిశ, సినిమా: యంగ్ హీరో విజయ్ దేవరకొండ గౌతమ్ తిమ్మనూరి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఈ మూవీని 2025 మార్చి 28న విడుదల చేయనున్నట్లు అదిరిపోయే విజయ దేవరకొండ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో శరవేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మూవీ నిర్మాత నాగవంశీ.. VD12 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. "VD12 సినిమా స్పై థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు రెండు పార్టులు ఉన్నాయి. ముందు ఒకటే సినిమా అనుకున్నాము. అయితే గౌతమ్ కథ పరంగా చాలా ఎక్కువగా రాసుకున్నాడు. దాన్ని మొత్తం తీయొచ్చు. దీంతో ఫస్ట్ పార్ట్ అదిరిపోయే ఎండింగ్ ఉంటుంది. ముందు ఫస్ట్ పార్ట్ మాత్రమే షూట్ చేస్తాము. ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ తర్వాత సెకండ్ పార్ట్ షూట్ చేస్తాము" అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed