- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Naga Chaitanya: నాగ చైతన్య తండ్రి కాలేడు.. సంచలన విషయం బయటపెట్టిన వేణు స్వామి!
దిశ, సినిమా: హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ ఇష్యూ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిని శోభిత, చైతు కొట్టిపడేశారు.. మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చేవారు. కానీ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున తన X ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. అయితే.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. వీళ్ల విషయంలో కూడా బిగ్ బాంబ్ పేల్చాడు వేణుస్వామి.
నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ల వైవాహిక జీవితంలో మార్పులు వస్తాయి. ఒక స్త్రీ కారణంగా వీళ్లు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ వీడియో రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు వేణు స్వామి. మీరు అంతా నన్ను తప్పుగా అనుకోవద్దు.. వాళ్లు ఎంగేజ్మెంట్‌కు పెట్టుకున్న ముహూర్తం బలం, అలాగే జాతకం వీళ్లకు అనుకూలంగా లేవు అని చెప్పాడు.
అలాగే.. ఇదే వీడియోలో ఓ షాకింగ్ విషయాన్ని కూడా రివీల్ చేశాడు వేణుస్వామి. గతంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పినప్పటి వీడియో బైట్‌ను చూపించారు. అందులో.. ‘నాగచైతన్య జాతక రిత్యా తండ్రి స్థానం బలంగా లేదు. అది తన తండ్రి స్థానం కావచ్చు. లేకపోతే నాగచైతన్య తండ్రిగా మారడం కావచ్చు. పెంపకం విషయంలో లోటు, పాట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం తదుపరి నాగచైతన్య జాతకంలో తండ్రి అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సహజసిద్ధంగా త్రండి అవ్వడం గురించి చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో చాలా మంది టెస్ట్యూ బేబీ విధానాన్ని ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అయితే నేను చెప్పలేను కానీ.. నాగచైతన్యకు మాత్రం సహజసిద్ధంగా తండ్రి అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే తన జాతకబలం అలాంటిది’ అంటూ బిగ్ బాంబ్ పేల్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.