Naga Chaitanya: నిన్న ఎంగేజ్మెంట్.. ఈరోజు పెళ్లి.. షాక్ మీద షాక్ ఇస్తున్న నాగ చైతన్య..

by Sujitha Rachapalli |
Naga Chaitanya: నిన్న ఎంగేజ్మెంట్.. ఈరోజు పెళ్లి.. షాక్ మీద షాక్ ఇస్తున్న నాగ చైతన్య..
X

దిశ, సినిమా: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. శోభిత ధూళిపాళతో అకస్మాత్తుగా నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. చాలా రోజులుగా వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని ప్రచారం జరిగినప్పటికీ.. ఇద్దరూ కాదనే చెప్పారు. కానీ ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు. దీంతో అక్కినేని అభిమానులు హ్యాపీగా ఉన్నా .. సమంత ఫ్యాన్స్ మాత్రం కొంచెం ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుండగా మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం సామ్ - చై ఎప్పటికైనా కలుస్తారనే హోప్ ఉండేదని.. ఈ క్షణం పూర్తిగా పోయిందని బాధపడుతున్నారు.

ఇక ఇదిలా అంటే కొత్త పెళ్లి కొడుకు చైతు.. పెళ్లి కూతురు పక్కన లేకుండానే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించాడని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన అక్కడి నుంచి రాజమండ్రి వెళ్లినట్లు సమాచారం. కాగా తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేష్ పెళ్లికి హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. 'నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో లేదో ఈరోజు పెళ్లికి అటెండ్ అయ్యాడు.. మొత్తానికి షాక్ మీద షాక్ ఇస్తున్నాడు చైతు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




Advertisement

Next Story