Nabha Natesh: ఆ మూవీతో మరోసారి ప్రూవ్ చేసుకున్న నభా నటేష్.. నెట్టింట ప్రశంసల జల్లు

by sudharani |
Nabha Natesh: ఆ మూవీతో మరోసారి ప్రూవ్ చేసుకున్న నభా నటేష్.. నెట్టింట ప్రశంసల జల్లు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నభా నటేష్.. తన నటనతో, అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక యాక్సిడెంట్ కారణంగా కొంత కాలం ఇండస్ట్రీకి దూరం అయినా ఈమె.. చాలా గ్యాప్ తర్వాత ‘డార్లింగ్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులే సొంతం చేసుకుంది. ఇందులో స్ప్లిట్ పర్సనాలటీ క్యారెక్టర్‌లో నభా నటేష్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఐదారు వేరియేషన్స్‌లో నటించి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది ఈ బ్యూటీ.

దీంతో ఆమె పాత్రకు ప్రేక్షకులు థియేటర్స్‌లో బాగా కనెక్ట్ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే నభాకు ఇలాంటి మంచి క్యారెక్టర్ దొరకడం.. అందులో ఆమె మెప్పించేలా పర్‌ఫార్మ్ చేయడం విశేషమనే చెప్పుకోవాలి. ‘డార్లింగ్’ సినిమా ట్రైలర్ రిలీజ్ నుంచే నభా నటేష్ యాక్టింగ్‌కు అప్రిషియేషన్స్ వచ్చాయి. ఇలాంటి పాత్రలో నటించాలనేది తన డ్రీమ్‌గా చెప్పుకొచ్చిన ఈ అమ్మడు.. ప్రజెంట్ ఇందులో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Advertisement

Next Story

Most Viewed