- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీ కోసం నా గుండెలోంచి రక్తం కారుతోంది.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించి విషయం తెలిసిందే. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడంతో గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఆయన మరణంతో తీవ్ర విషాదం లోకి వెళ్లిన ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. తారకరత్నను తలుచుకుంటూ అలేఖ్య వేసే పోస్టులు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా, అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ మన పిల్లల కోసం నేను ఇంకా ఇలా స్ట్రాంగ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ నా వరకు నువ్వే నా బలం. నువ్వు నాకు కావాలి నాన్నా. నేను బాధపడుతున్నాను. ఒంటరిగా ఉన్నా ఓటమిలో ఉన్నా. పైకి లేపేందుకు నువ్వు కావాలి. నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన రోజంటూ వస్తుందని అనుకోలేదు. నువ్వెప్పుడూ పై నుంచి నన్ను చూస్తూనే ఉంటావని నాకు తెలుసు. నీ కోసం నా గుండెల్లో నుంచి రక్తం కారుతోంది బంగారు. ఇలాంటి గందరగోళంలో నువ్వు నా తోడు లేవని బాధగా ఉంది’’ అని రాసుకొచ్చింది.