నా హార్ట్ రెండు సార్లు ముక్కలైంది.. కారణం అదేనంటూ తమన్నా ఆసక్తికర కామెంట్స్

by Hamsa |   ( Updated:8 Sept 2024 1:30 PM  )
నా హార్ట్ రెండు సార్లు ముక్కలైంది.. కారణం అదేనంటూ తమన్నా ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: తమన్నా భాటియా టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అంతేకాకుండా ఐటమ్స్ సాంగ్‌లోనూ అదిరిపోయే స్టెప్‌లేస్తూ దుమ్మురేపుతోంది. ఇటీవల మిల్కీ బ్యూటీ స్త్రీ-2 మూవీలో ఐటమ్ సాంగ్ చేసి ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు భారీ కలెక్షన్లతో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. పలు రికార్డులను కూడా సాధిస్తోంది. ప్రజెంట్ తమన్నా ఓ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. విజయ్ వర్మతో గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఈ లవ్ బర్డ్స్ వరుస మూవీస్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ తన బ్రేకప్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఇప్పటి వరకు నా హృదయం ముక్కలైంది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. మొదటిది టీనేజ్‌లో ఉన్నప్పుడు జరిగింది. కొత్త విషయాలు తెలుసుకోవాలనేది నా ఉద్దేశం.

ఆ కారణం వల్ల ఫస్ట్ రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నాను. కానీ నాకు అతను సెట్ కాదనిపించింది. ప్రతి చిన్న విషయంలో అబద్ధం చెప్పే వాళ్లంటే నాకు నచ్చదు. అతను అలాంటి వాడని తెలియడంతో ప్రమాదం అని తెలుసుకున్నా. కొంత కాలానికి బ్రేకప్ చెప్పాను’’అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ తమన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా అంటే విజయ్ వర్మ మూడో వాడా అని షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed