- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
శ్రీదేవిపై స్టార్ నటుడు ఆసక్తికర కామెంట్స్.. రాత్రంతా ఆ పిల్లా అందులోనే ఉంది!
దిశ, వెబ్‌డెస్క్: హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మా ప్రెసిడెంట్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న మురళి మోహన్ అతిలోక సుందరి దివంగత శ్రీదేవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘మా బంగారక్క’ చిత్రంలో శ్రీదేవి బాల్యనటిగా నటించిందని.. అప్పుడు తనకు మెచ్యూరిటీ లేదని మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. శ్రీదేవి ఎప్పుడు చిన్న పిల్లల బీహేవ్ చేస్తూ.. చిన్న పిల్లలను వెంట వేసుకుని తిరుగుతుందని (నవ్వుతూ) ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఈ చిత్ర షూటింగ్లో జరిగిన మరో సంఘటన గురించి కూడా మురళి మోహన్ గుర్తుచేసుకున్నారు. ‘ఓ రోజు చైల్డ్ ఆర్టిస్టులతో షూటింగ్ ఉండగా.. ప్రొడక్షన్ వారు పలువురు బాల్యనటుల్ని తీసుకొచ్చారు.
అయితే షూటింగ్ చూడాలని లిస్ట్‌లో లేని ఓ పిల్ల కూడా వచ్చింది. షుగింగ్ కంప్లీట్ అయ్యాక ఆ అమ్మాయి తల్లిదండ్రులొచ్చి మా పాప ఏదని అడగ్గా.. తను మా మూవీలో లేదని చెప్పేశాం. మరో అమ్మాయితో మా పాప వచ్చిందండీ అంటూ చాలా కంగారు పడిపోయారు. మిగతా పిల్లల్ని అడిగేసరికి చెరువులో షూటింగ్ అనంతరం కనిపించడం లేదని చెప్పారు. దీంతో అక్కడున్నవాళ్లంతా.. ఆ గ్రామ ప్రజలంతా వెతకసాగారు. రాత్రి వరకు వెతికినా ఆ పిల్ల దొరకలేదు. మార్నింగ్ చూసేసరికి చెరువులో కూరుకుపోయి కనిపించింది. దీంతో అందరం తీవ్ర విషాదానికి లోనయ్యామంటూ’ నటుడు మురళి మోహన్ కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చారు.