డీ గ్లామరస్‌గా మృణాల్ ఠాకూర్.. క్రేజీగా వైరల్ అవుతున్న బ్యూటీ న్యూ లుక్ ఫొటోస్

by sudharani |   ( Updated:2024-07-12 14:03:24.0  )
డీ గ్లామరస్‌గా మృణాల్ ఠాకూర్.. క్రేజీగా వైరల్ అవుతున్న బ్యూటీ న్యూ లుక్ ఫొటోస్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898AD’ చిత్రం ప్రజెంట్ టాక్ ఆఫ్‌ది గ్లోబల్ ఇండస్ట్రీగా మారిపోయింది. జూన్ 27 వరల్డ్ వైడ్ రిలీజైనా ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు (గ్రాస్) వసూళ్లు రాబట్టిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో ‘కల్కి’ పార్ట్ 2 కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

అయితే.. ‘కల్కి 2898AD’ చిత్రం సూపర్ సక్సెస్ అందుకోవడంతో.. అందులో అతిథి పాత్రలో నటించి మెప్పించిన నటీనటుల ఫొటోలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇటీవల విజయ్ దేవరకొండకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా మృణాల్ ఠాకూర్ పోస్టర్‌ను వదిలింది. ఈ మేరకు ‘‘కల్కి 2898AD’ ప్రపంపం నుంచి మృణాల్ ఠాకూర్‌ను దివ్యగా పరిచయం చేస్తున్నాం’ అంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ వై జయంతి మూవీ మేకర్స్ తెలిపింది. ఇందులో డీ గ్లామరస్‌గా ఆకట్టుకుంటున్న మృణాల్ న్యూ లుక్ ఫొటోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story